పల్లవి
ఆనందం నీలోనే – నా ఆత్మకు నిలయమా
ఆధారం నీవేగా – నా జీవన సత్యమా
అర్హతలేని నన్ను – కృపతో ఎన్నుకున్నావు
జీవితం అంతయు – నీ కోసమే – సాక్ష్యమై నిలిచెదను
ఆనందం నీలోనే – నా ఆత్మకు నిలయమా
ఆధారం నీవేగా – నా జీవన సత్యమా
చరణం 1
పదేపదే నే నిన్నే చేరగా
ప్రతిక్షణం నీ ప్రేమలో మునిగెదా
పదేపదే నే నిన్నే చేరగా
ప్రతిక్షణం నీ ప్రేమలో మునిగెదా
కలవరాల వేలలో – కన్నీటి మార్గములో
కలవరాల వేలలో – కన్నీటి మార్గములో
కాపాడే చేతులై – నన్ను చుట్టుకొనినావు
దివ్య శరణమా – నా స్తోత్ర గీతమా
పల్లవి
ఆనందం నీలోనే – నా ఆత్మకు నిలయమా
ఆధారం నీవేగా – నా జీవన సత్యమా
చరణం 2
నిరంతరం నీవే నా వెలుగుగా
నిత్యజీవ స్వాస్థ్యం నీవే ప్రభువా
నిరంతరం నీవే నా వెలుగుగా
నిత్యజీవ స్వాస్థ్యం నీవే ప్రభువా
నీ సన్నిధి వీడక – స్తుతులతో నిలిచెదా
నీ సన్నిధి వీడక – స్తుతులతో నిలిచెదా
నీ నామమునే ఎత్తి – లోకానికి చాటెదా
సత్య వాక్యమా – జీవ వాక్యమా
పల్లవి
ఆనందం నీలోనే – నా ఆత్మకు నిలయమా
ఆధారం నీవేగా – నా జీవన సత్యమా
చరణం 3
సర్వసత్యమే నా మార్గమై
సంఘక్షేమమే నా శ్వాసయై
సర్వసత్యమే నా మార్గమై
సంఘక్షేమమే నా శ్వాసయై
లోక మహిమ కానక – నీ జాడలో నడిచెదా
లోక మహిమ కానక – నీ జాడలో నడిచెదా
నీతోనే నిలిచెదను – నిత్య సీయోనులో
ఈ దర్శనం – నా పరమ ఆశయం
పల్లవి
ఆనందం నీలోనే – నా ఆత్మకు నిలయమా
ఆధారం నీవేగా – నా జీవన సత్యమా
అర్హతలేని నన్ను – కృపతో ఎన్నుకున్నావు
జీవితం అంతయు – నీ కోసమే – సాక్ష్యమై నిలిచెదను
ఆనందం నీలోనే – నా ఆత్మకు నిలయమా
ఆధారం నీవేగా – నా జీవన సత్యమా
Share This Lyrics 👇

Leave a Reply